: మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యమివ్వండి: జల్ మంథన్ లో చంద్రబాబు
దేశంలో చిన్న నీటి పారుదల రంగానికి ప్రాధాన్యమివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జల మంథన్’ పేరిట నదుల అనుసంధానంపై జరుగుతున్న సమావేశానికి ఆయన హాజరయ్యారు. దేశంలో నదుల అనుసంధానంపై చర్చ జరుగుతోందని, అయితే మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యమివ్వడం ద్వారా సాగులో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయన్నారు. ఈ దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించాలని ఆయన సూచించారు.