: శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద టీకాంగ్ నిరసనను అడ్డుకున్న పోలీసులు


శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై టీ కాంగ్రెస్ అటు అసెంబ్లీతో పాటు ఇటు విమానాశ్రయం వద్ద కూడా ఆందోళనకు తెరతీసింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే, ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎయిర్ పోర్టు వద్ద నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ నేత దానం నాగేందర్ సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు క్రమంగా అక్కడకి చేరిపోయారు. అసెంబ్లీలో తమ వాదనకు ప్రభుత్వ మద్దతు లభించడం వీహెచ్ సహా అక్కడి నేతల్లో మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో అక్కడికక్కడే ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయి దాటిపోకముందే మేల్కొన్న పోలీసులు వీహెచ్ సహా ఆందోళన కారుల నిరసనను అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News