: మీ పదవులు... ఎన్టీఆర్ పుణ్యమే: సండ్ర వెంకటవీరయ్య


"ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న పదవులకు నందమూరి తారక రామారావే కారణం. శంషాబాద్ టెర్మినల్ కు ఆయన పేరు పెడితే, అంత గింజుకుంటారెందుకు? తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుంది" అంటూ టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శంషాబాద్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం విపక్షాలతో కలిసి పోరు సాగించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనను టీడీపీతో పాటు బీజేపీ తిరస్కరించాయి. అనంతరం విలేకరులతో మాట్లాడిన వీరయ్య... కేసీఆర్, మధుసూదనాచారి, జానారెడ్డిలు అనుభవిస్తున్న పదవులు ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరు టెర్మినల్ కు సరైనదేనని ఆయన వాదించారు.

  • Loading...

More Telugu News