: అంగరంగ వైభవంగా ములాయం బర్త్ డే వేడుకలు... 75 అడుగుల కేక్ కటింగ్!


ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రేపు 75వ ఏట ప్రవేశిస్తున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలను ఈవేళ, రేపు వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని ములాయం అనుంగు శిష్యుడు ఆజం ఖాన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పటికే విదేశాల నుంచి ఆకర్షణీయమైన గుర్రపు బగ్గీని తెప్పించినట్టు ఆయన తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తరువాత ములాయంను బగ్గీపై ఊరేగిస్తూ వేడుకల సభకు తీసుకురానున్నామని వివరించారు. అక్కడ తన వయసుకు తగ్గట్టు ఏర్పాటు చేసిన 75 అడుగుల పొడవైన కేక్ ను ఆయన కట్ చేస్తారని తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఇతర మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ములాయం అభిమానులు పాల్గొంటారని వివరించారు.

  • Loading...

More Telugu News