: సభ్యుల ఆందోళనలో అర్థముంది: సీఎం కేసీఆర్


తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్ష సభ్యుల ఆందోళనలను సమర్థించారు. శుక్రవారం సభ ప్రారంభం కాగానే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా కేంద్రం నిర్ణయంపై సభలో ఆ పార్టీ ఉపనేత జీవన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం కేసీఆర్, సభ్యుల నిరసనలో అర్థముందన్నారు. కేంద్రం నిర్ణయంపై అన్ని పార్టీలతో చర్చించేందుకు ఓ 10 నిమిషాలు సభను వాయిదా వేయాలని ఆయన స్పీకర్ ను కోరారు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News