: మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి: లాలూకు ఒవైసీ హెచ్చరిక
ఆరెస్సెస్ ఆదేశాలతో ఆ సంస్థ నుంచి నిధులు అందుకుని మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేశారన్న ఆరోపణలపై మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఆరోపణలు చేసిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తక్షణమే తన వ్యాఖ్యలను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లాలూపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మతతత్వ బీజేపీకి క్రమంగా చేరువవుతున్నారని ఒవైసీ ఆరోపించారు.