: అత్యాధునిక ఆయుధాలు, బాటిల్ బాంబులు: సీఆర్పీఎఫ్ అధీనంలో రాంపాల్ ఆశ్రమం


కోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద గురు బాబా రాంపాల్ ఆశ్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టిన తరువాత ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడయ్యాయి. మారణాయుధాలు పోలీసులకు దొరికాయి. 12 బోర్ రైఫిల్స్-23... 315 బోర్ రైఫిల్స్-10, ఒక పిస్టల్ లభించాయి. వీటితో పాటు వందల సంఖ్యలో బాటిల్ బాంబులు, యాసిడ్ డబ్బాలు దొరికాయి. అంతే కాదు అత్యంత విలాసవంతమైన భవనాలు, స్విమ్మింగ్ పూల్, మూవీ థియేటర్లు ఆశ్రమంలో ఉన్నాయి. ఆశ్రమం మొత్తాన్ని ఖాళీ చేయించామని, ప్రస్తుతం సీఆర్పీఎఫ్ అధీనంలో ఆశ్రమం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బాబా రాంపాల్ ను హిస్సార్ సెంట్రల్ జైలుకు తరలించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News