: అవును.. నిజమే.. అందరికీ తెలిసిందే కదా?: అనుష్కా శర్మతో డేటింగ్ పై విరాట్ కోహ్లి


బాలీవుడ్ నటి అనుష్కా శర్మతో డేటింగ్ నిజమేనని, త్వరలో తాము ఒకటి కాబోతున్నామని భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి స్పష్టం చేశారు. "మా మధ్య ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. మేమేమీ దాచి పెట్టడం లేదు. పారిపోవడం లేదు. పదే పదే అనుష్కతో సంబంధంపై ప్రశ్నలు అడగవద్దు" అన్నాడు కోహ్లి. మా ఇద్దరి సంబంధం గురించి ఇకపై ఎవరూ చెవులు కొరుక్కోవద్దు అని ఓ సలహా కూడా ఇచ్చాడు. ఆసియా క్రీడల్లో పతకం తిరస్కరించి బాక్సింగ్ సమాఖ్య ఆగ్రహానికి గురైన సరితాదేవికి కోహ్లి మద్దతు పలికాడు. ఆమె భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలని క్రీడా శాఖకు విజ్ఞప్తి చేసినట్టు కోహ్లి వివరించాడు.

  • Loading...

More Telugu News