: కనకదుర్గమ్మ సేవలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి శుక్రవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. గురువారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి, నేటి ఉదయం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతుల విషయంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.