: కుప్పం గ్రామాల సమీపంలో ఏనుగుల సంచారం...భయాందోళనలో గ్రామస్థులు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలో ఏనుగుల సంచారం నిత్యం అక్కడి గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇన్నాళ్లూ పంట పొలాలపైనే దాడి చేస్తూ వచ్చిన ఏనుగులు, నేడు జనావాసాలకు అతి చేరువలోకి వచ్చాయి. నియోజకవర్గంలోని నాలుగు గ్రామాలకు అతి సమీపంలోకి వచ్చిన ఏనుగులు, అక్కడి పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున పంటలు నాశనమయ్యాయని సమాచారం. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.