: నేడు తెలంగాణ అసెంబ్లీ బీఏసీ భేటీ
తెలంగాణ శాసనసభలో సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) భేటీ నేడు జరగనుంది. స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి సీఎం కేసీఆర్ తో పాటు సభలో ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు. అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 25 దాకా సమావేశాలను పొడిగించాలని కేసీఆర్ భావిస్తున్న సంగతి తెలిసిందే.