: కోర్టు ఆదేశాలతో ఇబ్బంది లేదు: రంజిత్ సిన్హా


2జీ స్కాం విచారణ నుంచి తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినందుకు తానేమీ ఇబ్బంది పడలేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాను న్యాయస్థానం ఉత్తర్వులను పాటిస్తానని స్పష్టం చేశారు. కాగా, విచారణ సందర్భంగా 2జీ కేసు విచారణ, దర్యాప్తు బాధ్యతల నుంచి రంజిత్ సిన్హాను తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరువాత సీబీఐలో సీనియర్ అధికారి 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

  • Loading...

More Telugu News