: ఉద్యోగుల పనితీరు భేష్... పీఆర్సీపై కమిటీ వేస్తాం: బాబు
ఉద్యోగుల పనితీరు భేష్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుదూద్ తుపాను సహాయక చర్యల్లో ఉద్యోగుల సహకారం, శ్రమ మరచిపోలేమని అన్నారు. అందుకే ఉద్యోగుల కోసం 2019, 2022, 2029 సంవత్సరాలకు ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేశామని బాబు స్పష్టం చేశారు.