: 10వ ర్యాంకుకు దూసుకొచ్చిన శ్రీకాంత్
బ్యాడ్మింటన్ తాజా యువ కెరటం కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ ర్యాంకుల్లో దూసుకొచ్చాడు. భారత నెంబర్ వన్ క్రీడాకారుడిగా చైనాలో అడుగిడిన శ్రీకాంత్, చైనా ఓపెన్ టైటిల్ సాధించి సత్తా చాటాడు. దీంతో, ప్రపంచ ర్యాంకుల్లో కెరీర్ బెస్ట్ సాధించాడు. ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా, పారుపల్లి కశ్యప్ 17వ ర్యాంకులో నిలవగా, మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 4వ స్థానంలో నిలిచింది. భారత ఆశాకిరణం పీవీ సింధు 10వ స్థానంలో కొనసాగుతుండగా, డబుల్స్ జోడీ గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప 19వ ర్యాంకులో ఉన్నారు.