: ముద్దుల చెల్లి పెళ్లి ఫొటోలను ఆన్ లైన్లో పెట్టిన సల్మాన్
హైదరాబాదు ఫలక్ నుమా ప్యాలెస్ లో ఈ నెల 18న సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం అంగరంగవైభవంగా జరగడం తెలిసిందే. ఈ వివాహ ఫొటోలను సల్మాన్ ఆన్ లైన్లో పెట్టాడు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం అకౌంట్లలో ఐదు ఫొటోలను పోస్టు చేశాడు. అర్పిత్, ఆయుష్ శర్మల పలు రకాల హావభావాలను ఈ ఫొటోల్లో బంధించారు. "పెళ్లికి సంబంధించి కొన్ని ఫొటోలు పెట్టాను చూడండి" అంటూ సల్మాన్ ఈ మేరకు ట్వీట్ చేశాడు.