: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో పీవీ సింధు ఓటమి
హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ నుంచి భారత క్రీడాకారిణి పీవీ సింధు వెనుదిరిగింది. కౌలూన్ లో జరుగుతున్న టోర్నీలో తనకంటే తక్కువ ర్యాంకు ఉన్న జపనీస్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరా చేతిలో రెండో రౌండ్ లో ఓటమి పాలైంది. గంటపాటు జరిగిన ఆటలో 17-21, 21-13, 11-21 తేడాతో సింధు ఓడిపోయింది.