: బార్సిలోనాలో వెంకయ్యనాయుడుకి చేదు అనుభవం
స్పెయిన్ లోని బార్సిలోనాలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. బార్సిలోనాలో జరుగుతున్న స్మార్ట్ సిటీ ఎక్స్ పో వరల్డ్ కాంగ్రెస్ లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయన ఓ హోటల్ లో బసచేశారు. ఆయన బస చేసిన హోటల్ లాబీల్లోనే ఆయన బ్యాగును ఎవరో దొంగిలించారు. చోరీకి గురైన బ్యాగ్ లో పాస్ పోర్టు, ఇతర పత్రాలు, వ్యక్తిగత వస్తువులు ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. దీంతో, భారత ఎంబసీ అధికారులు స్పందించి ఆయనకు కొత్త పాస్ పోర్టు, ఇతర పత్రాలు సిద్ధం చేశారు.