: 2జీ కేసు దర్యాప్తు నుంచి సీబీఐ డైరెక్టర్ తప్పుకోవాలి: సుప్రీం


2జీ స్పెక్ట్రమ్ కేసు దర్యాప్తు నుంచి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక నుంచి కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. కేసు విచారణను సీబీఐ ఉన్నతాధికారులతో జరిపించాలని ఆదేశాలిచ్చింది. సీబీఐ గౌరవం పెంపొందించేలా రంజిత్ వ్యవహరించడం లేదని, కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. సిన్హాపై ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News