: ట్రక్ టైర్లు దొంగిలిస్తూ దొరికిపోయిన పోలీసులు
ఓ కేసులో భాగంగా సీజ్ చేసిన ట్రక్ టైర్లను దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోయారు ఉత్తరప్రదేశ్ లోని మకన్పూర్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు పోలీసులు. ఆ ప్రాంత డీసీపీ తనిఖీకి వచ్చే సరికి స్టేషన్ ఎస్ఐ రాకేశ్ ప్రతాప్, కానిస్టేబుల్ అశోక్ కుమార్ లు ట్రక్ కు చెందిన ఆరు టైర్లను విప్పదీసి, పాత టైర్లను బిగిస్తూ కనిపించారు. దీంతో, వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. వీరిని సస్పెండ్ చేయాలని కాన్పూర్ ఎస్పీకి డీసీపీ సిఫార్సు చేసినట్టు తెలిసింది.