: శ్రీలంక అధ్యక్ష పదవికి త్వరలో మధ్యంతర ఎన్నికలు!


ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసి, మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రూపొందించిన ఓ అధికారపత్ర ప్రకటనపై వెంటనే సంతకం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే ఆయన తన శ్రీలంకన్ ఫ్రీడమ్ పార్టీ ఏకగ్రీవ ఆమోదం పొందారు. ఈ నేపథ్యంలోనే మరోసారి దేశ అధ్యక్షుడు అయ్యేందుకు ఎన్నికలు జరపాలన్న నిర్ణయానికొచ్చారు. దాంతో వచ్చే ఏడాది జనవరి మొదట్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ప్రకటనను ఇప్పటికే విడుదల చేసినట్టు ఆర్థికాభివృద్ధి మంత్రి బాసిల్ రాజపక్స లంక పత్రిక డైలీ మిర్రర్ కు తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు లంక అధ్యక్షుడిగా ఎన్నికైన రాజపక్స మూడోసారి కూడా కావాలనుకోవడమే ఈ ఎన్నికలకు కారణం.

  • Loading...

More Telugu News