: టి.శాసనసభ అరగంట వాయిదా
శాసనసభలోకి టీటీడీపీ రీఎంట్రీ ఇవ్వడంతో సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. డీఎల్ఎఫ్ భూములపై చర్చ జరుగుతున్న సమయంలో తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ప్రసంగం పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా, రేవంత్ రెడ్డి సభకు క్షమాపణ చెప్పిన తర్వాతే మాట్లాడాలని అధికారపక్షం పట్టుబట్టింది. దీంతో, సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు.