: అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక యాప్


అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం RailYatri.in, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా ప్రత్యేక యాప్ తీసుకువస్తున్నాయి. రైళ్ల రాకపోకలకు సంబంధించి లైవ్ సమాచారం ఈ యాప్ ద్వారా పొందవచ్చు. పంపా చేరుకోవడానికి అయ్యప్ప భక్తులు టాక్సీలను బుక్ చేసుకునే వెసులుబాటును ఈ యాప్ కల్పిస్తుంది. దీనిపై RailYatri.in సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మనిష్ రాఠీ మాట్లాడుతూ, సినిమా టికెట్లు బుక్ చేసుకోవడానికి, పిజ్జాలు ఆర్డర్ చేయడానికి యాప్ లు ఉండగా, శబరిమల యాత్రికులకు యాప్ ఉండడం సబబేనని పేర్కొన్నారు. ఈ యాప్ ను RailYatri.in వెబ్ సైట్ హోమ్ పేజి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేక, గూగుల్ ప్లేస్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News