: సంస్కారం మరిచే వారిపై చర్యలు తీసుకోండి: స్పీకర్ కు కేసీఆర్ సూచన
సభలో సంస్కారం మరిచి వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి సూచించారు. మైహోమ్ భూముల వ్యవహారంలో విపక్షాల సభ్యులు మాట్లాడిన తీరు బాగాలేదన్న ఆయన, సదరు సభ్యులను బయటకు పంపాలని కోరారు. మైహోం వ్యవహారంలో కేటాయింపులు, పనుల ప్రారంభం మొత్తం కూడా రాష్ట్ర విభజనకు ముందే జరిగిందని, ఈ విషయంలో టీటీడీపీ సభ్యులు చేస్తున్న ఆరోపణలు సవ్యంగా లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.