: మోదీ ‘మోడల్ విలేజ్’ జయపూర్ కు మంచి రోజులొచ్చాయి!


జయపూర్... ప్రధాని నరేంద్ర మోదీ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక చేసుకున్న గ్రామం. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎక్కడ చూసినా జాతీయ, బహుళ జాతి సంస్థలకు చెందిన ప్రతినిధులు కనిపిస్తున్నారు. "మంగళవారం ఓ జపాన్ బ్యాంకు, ఢిల్లీ అర్బన్ బ్యాంకు ప్రతినిధులొచ్చారు. బుధవారం రెండు జపాన్ కంపెనీల ప్రతినిధులూ పర్యటించారు. దీంతో మా గ్రామం దశ మారిపోయేలా కనిపిస్తోంది" అంటూ ఆ గ్రామ సర్పంచ్ దుర్గావతి దేవి సంతోషంగా చెబుతున్నారు. నిన్నటిదాకా ఒక్క అధికారి కూడా తమ గ్రామ ముఖం చూడటానికి ఇష్టపడేవారు కాదని, మోదీ వచ్చి వెళ్లిన తర్వాత పెద్ద సంఖ్యలో కంపెనీల ప్రతినిధులు వచ్చి, ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందని ఆరా తీస్తున్నారని ఆమె వెల్లడించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, ఆర్థిక ప్రగతి అంశాలపైనే విదేశీ కంపెనీల ప్రతినిధులు ఆసక్తి కనబరుస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన సర్వేలు పూర్తి చేసిన సదరు ప్రతినిధులు పనులు కూడా మొదలుపెట్టేశారని ఆమె చెప్పారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జయపూర్ వాసులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

  • Loading...

More Telugu News