: రెక్కల్లేని విమానంతో పబ్ ముందు వాలిన వ్యక్తికి జరిమానా
కొన్ని రోజుల కిందట ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి తన చిన్న విమానంతో ఓ పబ్ ముందు ల్యాండవడం తెలిసిందే. ఆ ఘటన ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలోని న్యూమాన్ కౌంటీలో సంచలనం సృష్టించింది. రెక్కల్లేని విమానం నేరుగా వచ్చి ఓ వీధిలో దిగడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విమాన యజమాని ఆంథోనీ వైట్ వే (37) ఇంజిన్ కూడా ఆఫ్ చేయకుండా, పబ్ లోకి వెళ్లి లెమనేడ్ ఆర్డర్ చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన పోలీసులు వైట్ వేను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రూ.2.6 లక్షల జరినామా విధించింది. దీనిపై వైట్ వే మాట్లాడుతూ, తాను లెమనేడ్ తాగడంతో పాటు, టాయిలెట్ బ్రేక్ కోసం విమానం ల్యాండ్ చేశానని వివరించాడు.