: కత్రినా ఖాన్ ని చేద్దామనుకున్నా, కత్రినా కపూర్ గా మారిపోయావ్!: సల్మాన్
తన సోదరి వివాహ వేడుకకు హాజరైన కత్రినా కైఫ్ ను ఆటపట్టించాడు సల్మాన్ ఖాన్. స్టేజి మీద కత్రినా నటించిన 'చిక్ని చమేలి' పాట వస్తుండటంతో ఆమెను డాన్సు చేసేందుకు ఆహ్వానించాడు. కత్రినా రాకుండా కరణ్ జోహార్ వెనుక దాక్కుందట. అప్పటికీ వదలని సల్మాన్ "అయితే సరే, నీవు కత్రినా కైఫ్ వి కాదు, కత్రినా కపూర్ వే. ఇంక స్టేజి మీదకు రా" అని పిలిచాడట. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో స్టేజి దగ్గరకు వెళ్ళగా "నేను ఏమీ చేయను... కత్రినా ఖాన్ గా మారేందుకు నీకు ఓ అవకాశం ఇచ్చాను. కానీ నువ్వు కత్రినా కపూర్ గా మారిపోయావు" అని జోక్ చేసి అందరినీ నవ్వించాడట.