: విజయవాడలో టీడీపీ సర్వసభ్య సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్వసభ్య సమావేశం విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమయింది. తెలుగుతల్లి పాటతో సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబు పూలమాల వేసి నమస్కరించారు. ఈ సమావేశానికి నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణలతో పాటు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు హాజరయ్యారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం నెలకొల్పేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.