: మోదీ 'సోషల్' ప్రభంజనం!
సోషల్ నెట్వర్క్ తో ఎలాంటి సత్ఫలితాలు సాధించవచ్చన్నదానికి ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఉదాహరణ. ఎన్నికల్లో విజయం కానివ్వండి, ప్రభుత్వ పథకాలతో ప్రజలను మమేకం చేయడం కానివ్వండి... సోషల్ మీడియాను వారధిగా ఉపయోగించుకుని ఆయన సఫలీకృతులయ్యారనడంలో సందేహం అక్కర్లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్ లను వేదికగా చేసుకుని ప్రధాని సాగిస్తున్న హైటెక్ పాలన ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. అందుకే ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలకు విపరీతమైన ఆదరణ. ట్విట్టర్ లో 80 లక్షల మంది ఫాలోయర్లతో ప్రపంచంలోనే మూడస్థానానికి చేరుకున్న మోదీ, ఇప్పుడు ఫేస్ బుక్ లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లతో రెండోస్థానానికి ఎగబాకారు. ఫేస్ బుక్ లో ప్రజాదరణ పరంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 4.3 కోట్ల మందితో ప్రథమస్థానంలో ఉన్నారు. ఈ మేరకు ఫేస్ బుక్ ఓ ప్రకటన చేసింది. అటు, ట్విట్టర్లో మోదీ కంటే పైన ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు.