: ఏలూరులోనూ కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు


పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోనూ హైదరాబాద్ తరహా కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు మొదలయ్యాయి. నేరాల అదుపులో భాగంగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఏలూరులోని పాముల దిబ్బ ప్రాంతంలో ఇంటింటి సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. నిందితులతో పాటు వారి వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ తరహా సోదాలకు తెర తీశామని డీఎస్పీ సరిత తెలిపారు.

  • Loading...

More Telugu News