: నేటి నుంచి తెలంగాణ పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా!


విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ పరిశ్రమలకు నేటి నుంచి ఊరట లభించనుంది. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం నేటి నుంచి తన నిర్ణయాన్ని అమలు చేయనుంది. తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరత నేపథ్యంలో అటు గృహావసరాలతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఖరీఫ్ చివరి దశకు చేరడం, శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ కొరత కొంత తగ్గింది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు ఇకపై నిరంతర విద్యుత్ ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమలులోకి రానుంది.

  • Loading...

More Telugu News