: నేడు కోర్టు ముందుకు బాబా రాంపాల్


బుధవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న వివాదాస్పద గురు బాబా రాంపాల్ ను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటల తరువాత పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం నాడు ఆయనపై దేశద్రోహం కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, గత రాత్రి బాబా రాంపాల్ ను పంచకుల సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళిన పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News