: విద్యుదాఘాతానికి రైతు బలి
ఇంటికి రక్షణగా ఉంటుందని ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ వ్యవస్థే ప్రాణాలు తీసిన విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పెద్ద వడుగూరు మండలం భీమునిపల్లి గ్రామానికి చెందిన రైతు పీతాంబరరెడ్డి (38) గురువారం నాడు సోలార్ సిస్టంను ఆపివేయాలన్న తొందరలో కరెంటు షాక్ కు గురయ్యాడు. వెంటనే స్పందించిన బంధువులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు స్పష్టం చేశారు.