: చెప్పుకుంటే... మహా భారతమే: గత పాలకులపై కేసీఆర్ ఫైర్


‘రాసుకుంటే రామాయణం... చెప్పుకుంటే మహాభారతం’ ఇదీ గత పాలకుల తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్య. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ సాగు నీటి రంగం తీవ్ర నిరాదరణకు గురైందన్న ఆయన తన బాధను ఇలా వ్యక్తీకరించారు. శ్రీశైలం ఎడమ కాల్వకు నిధుల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అడిగిన ప్రశ్నకు స్పందించిన కేసీఆర్, గతంలో టీడీపీ ప్రభుత్వం సహా కాంగ్రెస్ సర్కారు కూడా తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమ చూపిందని మండిపడ్డారు. 1981లోనే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినా, ఆ రెండు పార్టీల ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News