: నిధులు తేకపోతే ప్రవేశం లేదు: కేంద్ర మంత్రులపై బీహార్ సీఎం వివాదాస్పద వ్యాఖ్య


నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న బీహార్ సీఎం జితన్ రాం మాంఝీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన మంత్రులపై విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరిపడ నిధులను విడుదల చేయించాల్సిందేనని, లేకపోతే వారిని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వబోమని ప్రకటించారు. "కేంద్ర కేబినెట్ లో రాష్ట్రం నుంచి చాలా మంది మంత్రులున్నారు. వారంతా రాష్ట్రానికి సరిపడ నిధులను కేంద్రం నుంచి మంజూరు చేయించాల్సిందే. లేకుంటే వారికి రాష్ట్రంలో ప్రవేశం లేదు" అంటూ మాంఝీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాంఝీపై అటు విపక్షాల నుంచే కాక స్వపక్షం నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మాంఝీ తాజా వ్యాఖ్యలపై మండిపడ్డ జేడీయూ ఎమ్మెల్యే ఒకరు, మాంఝీకి పిచ్చిపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News