: కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి చర్యలు చేపట్టండి: అధికారులను ఆదేశించిన బాబు


కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో రాయలసీమకు మేలు జరుగుతుందని... రెండు నదుల అనుసంధానానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని... ఈలోగా ఎత్తిపోతల ద్వారా పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా నదిలోకి తరలించాలని... అప్పుడు ఎగువనున్న కృష్ణా జలాలను రాయలసీమకు ఉపయోగించవచ్చని అధికారులకు సూచించారు. ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణలోకి పంపించడానికి రూ. 1272 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. పోలవరం ప్రధాన కాల్వ పనులను రబీనాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న తోటపల్లి, వంశధార, వెలుగొండ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News