: రైతు సమస్యలను వెంటనే పరిష్కరించండి: ఉద్ధవ్ థాకరే డిమాండ్
మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుందనుకున్న శివసేన ప్రతిపక్ష పాత్రకు పరిమితమయింది. అంతేకాదు, ప్రతిపక్ష పాత్రలో అప్పుడే ఒదిగిపోయింది కూడా. మహారాష్ట్రలోని కరవు ప్రాంతాల్లో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగ్ పూర్ లో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు. అంతేకాకుండా, కరవు రైతులను ఆదుకోవాలని కోరుతూ 'మహా' ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కు సేన నేతలు వినతిపత్రం కూడా సమర్పించారు.