: బాబా రాంపాల్ అరెస్ట్... తీవ్ర ఉద్రిక్తత


హర్యానాలోని హిస్సార్ లో ఉన్న బాబా రాంపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందే రాంపాల్ ఆశ్రమాన్ని భారీ సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులు... రాంపాల్ ముఖ్య అనుచరుడు పురుషోత్తందాస్ సహా మరో 450 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో ఆరుగురు మృతి చెందారని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో, హర్యానా ముఖ్యమంత్రికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ ఫోన్ చేశారు. ఆశ్రమంలో నెలకొన్న పరిస్థితిపై వాకబు చేశారు. రాంపాల్ అరెస్ట్ కావడంతో ఆశ్రమం వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాంపాల్ పై కోర్టు ఇప్పటి వరకు 43 అరెస్ట్ వారంట్లను జారీ చేసింది.

  • Loading...

More Telugu News