: అర్పితా సంగీత్ రోజు అమీర్ ఖాన్ కు నిద్ర లేకుండా చేశారట!


కొంతకాలం నుంచి బద్ధ శత్రువుల్లా ఉన్న సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లు అర్పితా ఖాన్ వివాహ సంగీత్ వేదికగా ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆ సంతోష సమయంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే, చాలామంది 'అరే, ఈ సమయంలో అమీర్ ఖాన్ కూడా ఉంటే బాగుండేదే!' అని అనుకున్నారు. కానీ, నాటి ఫ్రేమ్ లో అమీర్ కూడా జాయినయ్యాడని ఆలస్యంగా తెలిసింది. సల్మాన్-షారుక్ కలిసిన విషయాన్ని అమీర్ వద్ద మీడియా ప్రస్తావిస్తే, "అవును, నాకు కూడా వారిద్దరి విషయం తెలుసు. వాస్తవానికి, ఆ రోజు వాళ్లిద్దరూ నన్ను నిద్రపోకుండా చేశారు. దాదాపు 1.30 గంటల ప్రాంతంలో సల్మాన్, షారుక్ ముందు నాకు ఫోన్ చేశారు. ఆ విషయం గురించే చెప్పారు. మళ్లీ 2.30 గంటల సమయంలో మేము ఒకరికొకరం ఫేస్ టు ఫేస్ చాటింగ్ చేశాం. అలా ఉదయం వరకు మాట్లాడుతూనే ఉన్నాం. దాంతో, నేను మేల్కొనే ఉన్నా" అని ముంబయి ఎయిర్ పోర్టులో తెలిపాడు. అంటే మొత్తానికి బాలీవుడ్ 'త్రీ ఖాన్స్' కలసిపోయినట్టేనన్నమాట!

  • Loading...

More Telugu News