: బాబు సింగపూర్ నాయుడులా కాదు, ఏపీ నాయుడులా వ్యవహరించాలి: అంబటి


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. రాజధాని కోసం భూములిస్తే భవిష్యత్ ఏమవుతుందోనన్న భయం రైతుల్లో నెలకొని ఉందని అన్నారు. రాజధాని భూసేకరణ విషయంలో నివ్వెరపరిచే వాస్తవాలు బయటికొస్తున్నాయని తెలిపారు. బాబు సింగపూర్ నాయుడులా కాకుండా, ఏపీ నాయుడులా వ్యవహరించాలని సూచించారు. కనీసం చిత్తూరు నాయుడులా అయినా ఉండాలన్నారు. సీఎం డ్రామాలు ఆపి, రైతుల బాధలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ ఊరుకోదని, ప్రజా ఉద్యమం చేపడతామని అంబటి హెచ్చరించారు. బాబును ప్రజలు రైతు ద్రోహిగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News