: శిల్పా మోహన్ రెడ్డిపై కేసు నమోదు


కొద్ది రోజుల క్రితం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ లో జరిగిన గొడవ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. తాజాగా మాజీ మంత్రి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు చేసి, జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. పక్షపాతంతోనే తమపై కేసులు నమోదు చేశారని... టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేయాలని వైకాపా కోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన కోర్టు శిల్పా మోహన్ రెడ్డి, నంద్యాల కౌన్సిల్ ఛైర్ పర్సన్, మరో ముగ్గురు కౌన్సిలర్లపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో, వీరందరిపై కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News