: ట్విట్టర్ లో మోదీ రికార్డు... 80 లక్షలు దాటిన ఫాలోయర్లు
ట్విట్టర్ లో అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న వారిలో భారత ప్రధాని మోదీ టాప్-3 పొజిషన్ లో ఉన్నారు. ఆయనకన్నా ముందు ఉన్నది ఎవరో తెలుసా? బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ లే. మోదీ ట్విట్టర్ ఖాతాను ప్రస్తుతం 80 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఒబామాకు 4.3 కోట్ల మంది, పోప్ ఫ్రాన్సిస్ కు 1.4 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారని ట్విట్టర్ పేర్కొంది.