: డిసెంబర్ 5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా
ప్రజలకిచ్చిన హామీల అమలు విషయంలో చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 5న విశాఖపట్నంలో మహాధర్నా నిర్వహించనుంది. ఈ మహాధర్నాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. అదే రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించనుందని ఆయన వివరించారు.