: ఖైదీల భార్యలతో జైలర్ అసభ్య ప్రవర్తన!
జైల్లో ఉన్న విచారణ ఖైదీలతో మాట్లాడేందుకు వచ్చిన ఇద్దరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఒడిశా గంజాం జిల్లాలోని సోరాడ సబ్ జైలు సూపరింటెండెంట్ లక్ష్మీకంట పతిని ఖైదీలు గంటల పాటు నిర్బంధించారు. చివరికి బారఘర్ పోలీసు స్టేషన్ అధికారులు వెళ్లి ఖైదీలకు నచ్చజెప్పి జైలర్ ను విడిపించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నట్టు జైళ్ళ విభాగం డీఐజీ గోపబంధు తెలిపారు.