: రవి పూజారి హిట్ లిస్టులో బాలీవుడ్ ప్రముఖులు!


కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ రవి పూజారి హిట్ లిస్టులో మహేశ్ భట్, ఫరా ఖాన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే అరెస్టైన రవి పూజారి గ్యాంగు సభ్యులను విచారించగా, పలు విషయాలు వెల్లడయ్యాయి. ముంబయిలో ఫరా ఖాన్ నివాసంతో పాటు, షారుఖ్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించాలని పూజారి తమకు ఆదేశాలిచ్చాడని వారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు తెలిపారట. అంతేగాకుండా, సీనియర్ డైరక్టర్ మహేశ్ భట్ కదలికలపై రెండు నెలలుగా కన్నేశామని కూడా వెల్లడించారట. కాగా, ఈ ఏడాది ఆరంభంలో షారుఖ్ ఖాన్ కు రవి పూజారి నుంచి ఫోన్ కాల్స్ రావడం తెలిసిందే. దీంతో, షారుఖ్ కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అటు, నిర్మాత అలీ మొరానీ నివాసం ఎదుట కాల్పుల ఘటనలోనూ పూజారి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News