: ఇస్రోకు 'ఇందిరా గాంధీ శాంతి పురస్కారం'


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు 2014కు గానూ ప్రభుత్వం 'ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి' అవార్డును ప్రకటించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షత వహించిన అవార్డు జ్యూరీ ఈ ప్రకటన చేసింది. "ఇస్రో సాధించిన సరికొత్త విజయానికి, మార్స్ ఆర్బిటర్ మిషన్ ను విజయవంతంగా అంగారకుడిపైకి చేర్చడం, అంతేగాక శాంతియుత విధానంలో బాహ్య అంతరిక్షంలో అంతర్జాతీయంగా గణనీయమైన సహకారాన్ని బలోపేతం చేసినందుకు గుర్తింపుగా ఇందిరా గాంధీ శాంతి పురస్కారం ప్రకటించాం" అని జ్యూరీ ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News