: మహిళా బాక్సర్ కు సచిన్ బాసట... కేంద్రానికి లేఖ


నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ సరితా దేవికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బాసటగా నిలిచాడు. ఆసియా క్రీడల్లో పతకం నిరాకరించి సస్పెన్షన్ వేటుకు గురైన ఆమెకు కేంద్రం మద్దతివ్వాలంటూ లేఖ రాశాడు. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి సర్బానంద సోనోవాల్ కు రాసిన లేఖలో, సరితా దేవి ఇప్పటికే క్షమాపణ చెప్పిందని, ఆమెపై సస్పెన్షన్ ను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆమెకు పూర్తి మద్దతు ఇవ్వాలని, కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి నుంచి కాపాడాలని సచిన్ విజ్ఞప్తి చేశాడు. ఆసియా క్రీడల బాక్సింగ్ లో ఓ బౌట్ లో తనకు అన్యాయం జరిగిందంటూ సరితా దేవి కాంస్య పతకం నిరాకరించింది. దీంతో, బాక్సింగ్ ఇండియా సంఘం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది.

  • Loading...

More Telugu News