: అమెరికాలో చలి చంపేస్తోంది!


చలి గుప్పిట్లో అమెరికా విలవిల్లాడిపోతోంది. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మంగళవారం సున్నా కంటే దిగువకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా దట్టమైన పొగ మంచు ఆవరించేసింది. భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో న్యూయార్క్ పశ్చిమ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే హవాయిలో కూడా 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయి ఉష్ణోగ్రత నమోదైందని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. 1976 తర్వాత దేశంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని ఆ శాఖ అధికార ప్రతినిధి సుసాన్ బుచానన్ పేర్కొన్నారు. న్యూయార్క్ పశ్చిమ ప్రాంతం సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 1.5 మీటర్ల మేర మంచు పరుచుకుపోయింది.

  • Loading...

More Telugu News