: ‘ఆదర్శ్’ చార్జిషీట్ నుంచి చవాన్ పేరును తొలగించలేం: బాంబే హైకోర్టు


మహారాష్ట్రను కుదిపేసిన ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఆదర్శ్ కేసు చార్జిషీట్ నుంచి ఆయన పేరును తొలగించాలన్న సీబీఐ పిటిషన్ ను బాంబే హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. అయితే, ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తూ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తహిలియానీ బుధవారం తీర్పు చెప్పారు. ఇందుకోసం నాలుగు వారాల గడువిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. నాలుగు వారాల వరకు చవాన్ పై ఎలాంటి అభియోగాల నమోదు కానీ, విచారణ కానీ జరపరాదని ఈ కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలలుగా చవాన్ ఈ మినహాయింపును అనుభవిస్తున్నారు, మరో నాలుగు వారాల పాటు సదరు మినహాయింపును పొడిగిస్తున్నామని హైకోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News