: ఎమర్జెన్సీ కాలం నాటి చట్టం వెనక్కి!
1977 నాటి 'అత్యవసర సమయం'(ఎమర్జెన్సీ)లో ఇందిరా గాంధీ తీసుకువచ్చిన ఎన్నికల చట్టాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లా కమిషన్ సైతం కేంద్రానికి నివేదిక సమర్పించింది. 37 సంవత్సరాల నుంచి అమలులో ఉన్న వివాదాస్పద ఎన్నికల చట్టాన్ని తొలగించాలని మోదీ సైతం భావిస్తున్నారని సమాచారం. దీంతోపాటు మరో 36 చట్ట సవరణలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది.