: ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థకు కొత్త సీఈవో, సీఎఫ్ఓలు
సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ అనుబంధ బీపీఓ (బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్) సంస్థకు అనూప్ ఉపాధ్యాయ కొత్త సీఈవోగా నియమితులయ్యారు. నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా దీపక్ భల్లాను నియమించింది. ఇప్పటివరకు మాతృ సంస్థ ఇన్ఫోసిస్ లో ప్రపంచవ్యాప్త ఆర్ధిక సేవల విభాగం అధిపతిగా పనిచేసిన అనూప్, రెండు దశాబ్దాలకు పైగా ఇదే కంపెనీలో వివిధ కార్యనిర్వాహక పదవుల్లో ఉన్నారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా మాట్లాడుతూ "బీపీవో మాకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న సంస్థ" అని చెప్పారు.